![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో రాబోతోంది. దానికి సంబందించిన ఒక లోగో కూడా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ 8 సింబల్ చూసి రెండు ఇల్లు ఉంటాయేమో ఈ కొత్త సీజన్ లో అనే డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు చాల మంది. ఐతే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ని అప్ డేట్ చేస్తుకుంటూ వెళ్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ పేర్లు చూస్తే షో వేణుస్వామి, బర్రెలక్క, కుమారీ ఆంటీ, తేజశ్విని గౌడ, వైష్ణవి పిస్సే, బంచిక్ బబ్లూ, సాకేత్, శ్వేతా నాయుడు, యాదమరాజు, మై విలేజ్ షో అనీల్, నిఖిల్, అక్షిత, సోనియా సింగ్, ఖయూమ్, రేఖా భోజ్ వంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే శివాజీ పేరు కూడా మళ్ళీ వినిపిస్తోంది.
అయితే శివాజీని కంటెస్టెంట్ గా కాదు.. బిగ్ బాస్ న్యూ సీజన్ బజ్ కి హోస్ట్ గా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ అంటే మాటలు కాదు. అందులో అడిగే ప్రశ్నలు మాములుగా ఉండవు. బుర్రను బొప్పికట్టించేలా లోపల ఎం జరిగిందో హోస్ట్ చెప్పించగలగాలి. ఆ టాలెంట్ శివాజితో పుష్కలంగా ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎలాగో పొలిటికల్ అనలిస్ట్ గా కూడా శివాజీకి మంచి పేరు కూడా ఉంది. బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేయడం శివాజీకి పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రజలు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని కోరేసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రవర్సీ, ఎంటర్టైన్మెంట్ విత్ కుళ్ళు కామెడీ ఇలా అన్నమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రవర్సి అంటే మొదటగా గుర్తొచ్చేది ఆర్జివి, తరువాత శివాజీ. చూడాలి ఒక వేళ శివాజీ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ ఐతే ఆడియన్స్ కల నెరవేరినట్టే.. బిగ్ బాస్ చూడకపోయినా బజ్ ని చూసే గారెంటీ ఉంది.
![]() |
![]() |